: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈరోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 11 పాయింట్లు లాభపడి 27,012 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 8,273 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ లో టాటాపవర్ సంస్థ షేర్లు అత్యధికంగా 3.13 శాతం లాభపడి రూ.75.80 వద్ద ముగిశాయి. వీటితోపాటు హెచ్సీఎల్ టెక్, అంబుజా సిమెంట్, పవర్ గ్రిడ్, బీహెచ్ ఈఎల్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. కాగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ అత్యధికంగా 1.64 శాతం నష్టపోయి రూ.759.40 వద్ద క్లోజయింది. దీంతోపాటు ఇన్ఫోసిస్, జీ ఎంటర్ టైన్ మెంట్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్ సంస్థల షేర్లు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News