: కుర్దిష్ పోలీస్ స్టేషన్ పై కారుబాంబు దాడి... పలువురికి గాయాలు
టర్కీలోని కుర్దిష్ ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మార్దిన్ ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్ పై కారుబాంబు దాడి జరిగింది. సిరియా సరిహద్దుల్లో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో పలువురు గాయపడినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. శక్తిమంతమైన పేలుడు సంభవించడంతో పలువురు గాయపడ్డారని, క్షతగాత్రులను వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ ల ద్వారా తరలించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ అనటోలియా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.