: కేరళ తీరాన్ని తాకిన రుతు పవనాలు!... మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ!

ఓ అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగిన నైరుతి రుతు పవనాలు ఎట్టకేలకు దారిలోకి వచ్చాయి. కొద్దిసేపటి క్రితం రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఫలితంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు కేరళ తీరాన్ని తాకిన రుతు పవనాలు మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు రోజుల తర్వాత భారీ వర్షాలు కురవనున్నాయి. రుతు పవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో సాగు జోరందుకోనుంది. ఈ ఏడాది ఆశించిన మేర వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు కూడా సాగుకు సన్నద్ధమవుతున్నారు.

More Telugu News