: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న ‘హౌస్ఫుల్ 3’


సాజిద్-పర్హాద్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘హౌస్ఫుల్ 3’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. పూర్తి వినోదాత్మక చిత్రంగా వచ్చిన ఈ మూవీకి తొలి మూడు రోజుల్లో ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ చిత్రం భారత్లో రూ.73.02 కోట్లు, విదేశాల్లో రూ.27.01 కోట్ల వ‌సూళ్లు సాధించిద‌ని చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషన్ పేర్కొంది. బాక్సాఫీస్ వ‌ద్ద తాను న‌టించిన చిత్రం భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డంతో ‘హౌస్ఫుల్ 3’ క‌థానాయ‌కుడు అక్ష‌య్ కుమార్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఈ సినిమాలో క‌థానాయ‌కులుగా అక్ష‌య్‌తో పాటు రితేశ్‌ దేశ్‌ముఖ్‌, అభిషేక్‌ బచ్చన్ కూడా న‌టించిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News