: పాక్ కు షాకిచ్చిన అమెరికా!... పఠాన్ కోట్ సూత్రధారులను శిక్షించాల్సిందేనన్న ఒబామా!


భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి దిగిన వారు పాకిస్థానీయులేనని నిన్న చైనా అధికారిక వార్తా సంస్థ తేల్చిచెప్పేసింది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ కు షాకిచ్చింది. పఠాన్ కోట్ పై జరిగిన దాడి సూత్రధారులను శిక్షించాల్సిందేనని పాక్ ను అమెరికా కోరింది. భారత ప్రధానితో భేటీ తర్వాత ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇరువురు నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన పాక్ కు గట్టి షాకే ఇచ్చింది. పాక్ భూభాగం మీద కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా ‘డీ కంపెనీ’ పేరును కూడా ఆ ప్రకటన ప్రస్తావించింది. పఠాన్ కోట్ దాడి సూత్రధారులతో పాటు 2008 ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించిన నిందితులను కూడా పాక్ శిక్షించాల్సిందేనని ఆ ప్రకటన డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News