: వేలానికి ప్రిన్సెస్ డయానా దుస్తులు
బ్రిటన్ ప్రిన్సెస్ డయానా ధరించిన దుస్తులను వేలం వేయనున్నారు. ఈ వేలం కెర్రీ టేలర్ ఆక్షన్స్ ఆధ్వర్యంలో జూన్ 14వ తేదీన జరగనుంది. నీలం, ఆకుపచ్చ రంగులో ఉన్న దుస్తులకు ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ దుస్తులను 1985-86 సంవత్సరాల మధ్య కాలంలో ఆమె ధరించారు. కేథరిన్ వాల్కర్, ఎలిజబెత్, డేవిడ్ ఇమ్మానుయేల్ డిజైన్ చేసిన ఈ దుస్తులకు 1,15,000 డాలర్ల నుంచి 1,44,000 డాలర్లు వరకు పలికే అవకాశం ఉన్నట్లు వేలం నిర్వాహకులు తెలిపారు.