: సోమాలియాలో మరో మహిళా జర్నలిస్టు కాల్చివేత
కొన్ని నెలల క్రితం సోమాలియాలో ఓ మహిళా జర్నలిస్టును కాల్చి చంపిన దారుణ ఘటనను మరవక ముందే ఆ దేశ రాజధాని మొగదీషులో మరో మహిళా జర్నలిస్టును కాల్చివేసిన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. సాగల్ సలాద్ ఒస్మాన్ అనే మహిళ సోమాలియాలో రేడియో ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. ఓ విశ్వవిద్యాలయం వెలుపల తుపాకి, ఆయుధాలతో పలువురు దుండగులు ఆమె కోసం మాటు వేశారని, ఆమె అటువైపుగా రాగానే కాల్పులు జరిపారని అక్కడి మీడియా తెలిపింది. మహిళా జర్నలిస్టును హత్య చేయడాన్ని ఆ దేశాధ్యక్షుడు సహా పలు సంస్థలు తీవ్రంగా ఖండించాయి.