: దేవుళ్ల చిత్రాలతో డోర్ మ్యాట్లు విక్రయించిన అమెజాన్ కు కొత్త కష్టాలు!
ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అమేజాన్ ను బహిష్కరించాలని, యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. ఆ సంస్థ వివిధ మతాలకు చెందిన దేవుళ్ల చిత్రాలతో కూడిన డోర్ మ్యాట్లను ఆన్ లైన్ లో విక్రయించడమే ఇందుకు కారణం. లక్ష్మీ దేవి, వినాయకుడు, శివుడు తదితర దేవతామూర్తుల చిత్రాలతో పలు దేవాలయాల ఫోటోలు, ఖురాన్, ఏసుక్రీసులను సైతం డోర్ మ్యాట్లపై ముద్రించి అమేజాన్ విక్రయించింది. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్లు 'బాయ్ కాట్ అమేజాన్' పేరిట ప్రచారం మొదలు పెట్టగా, అదిప్పుడు వైరల్ అయింది. కస్టమర్ల కోపాగ్నిని గురించి తెలుసుకున్న అమేజాన్, జరిగిన తప్పుకు క్షమాపణ చెబుతూ, డోర్ మ్యాట్ల అమ్మకాలను నిలిపేసినప్పటికీ, ఆ సంస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.