: కల నెరవేరింది!... ఊరిస్తున్న ఫ్రెంచ్ ఓపెన్ ను ఒడిసిపట్టిన జకోవిచ్!


సెర్బియా టెన్నిస్ సంచలనం నొవాక్ జకోవిచ్ ను ఏళ్ల తరబడి ఊరిస్తున్న కల ఎట్టకేలకు నెరవేరింది. ఆస్ట్రేలియన్, యూఎస్, వింబుల్డన్ టైటిళ్లను ఇప్పటికే సాధించిన జకోవిచ్... ఫ్రెంచ్ ఓపెన్ లో మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పోరులో అతడు ఎర్ర మట్టి కోర్టులో సత్తా చాటాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నిన్న జరిగిన పురుషుల సింగిల్స్ లో అతడు ఆండీ ముర్రేను 3-6, 6-1, 6-2, 6-4 స్కోరు తేడాతో మట్టి కరిపించాడు. వెరసి తన చిరకాల కలను నెరవేర్చుకున్న జకోవిచ్... వరుసగా నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. నాలుగు సెట్ల పాటు కొనసాగిన నిన్నటి ఫైనల్ లోనూ జకోవిచ్ కు ఓటమి తప్పదా అన్న రీతిలో ముర్రే తనదైన శైలిలో సత్తా చాటాడు. తొలి సెట్ ను కైవసం చేసుకున్న ముర్రే... జకోవిచ్ కు పెను సవాల్ విసిరాడు. అయితే వెనువెంటనే తేరుకున్న జకోవిచ్... వరుసగా మూడు సెట్లలో ముర్రేను చిత్తు చేసి తన కలను నెరవేర్చుకున్నాడు. నిన్నటి విజయంతో జకోవిచ్ ఖాతాలో చేరిన గ్రాండ్ స్లామ్ టైటిళ్ల సంఖ్య 12కు చేరింది.

  • Loading...

More Telugu News