: అమెరికాలో పెరిగిన నిరుద్యోగుల సంఖ్య... బాండ్, స్టాక్, ఫారెక్స్ మార్కెట్లు కుదేలు
జూన్ లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందని భయపడుతున్న వేళ, అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. యూఎస్ నాన్ -ఫామ్ పేరోల్స్ మేలో 38 వేలకు పైగా పెరిగాయి. అంటే, నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. అంతకుముందు రాయ్ టర్స్ నిర్వహించిన పోల్ లో పాల్గొన్న 105 మంది ఎకానమిస్టులు, నిరుద్యోగుల సంఖ్య మరింతగా పెరగవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. నవంబర్ 2007 తరువాత నిరుద్యోగుల సంఖ్య 4.7 శాతానికి పెరిగిందన్న వార్తలతో, యూఎస్ ఈక్విటీలతో పాటు యూరోపియన్ స్టాక్స్ నష్టపోయాయి. డాలర్ మూడు వారాల కనిష్ఠానికి దిగిపోయింది. 10 సంవత్సరాల యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడి 1.702 శాతానికి దిగజారింది. ఇది మూడు వారాల కనిష్ఠం. యూఎస్ లో బ్యాంకు సెక్టార్ ఈక్విటీలు భారీగా నష్టపోయాయి. ఎస్అండ్ పీ 500 ఫైనాన్షియల్ ఇండెక్స్ 1.7 శాతం దిగజారగా, యూరప్ ఆటో సెక్టార్ ఇండెక్స్ 2.3 శాతం తగ్గింది. డాలర్ తో యూరో 1.6 శాతం లాభపడింది.