: 'ఈఎస్పీఎన్' ఫేమ్ 100 టాప్ 10లో కోహ్లీ


ప్రముఖ స్పోర్ట్స్ టీవీ ఛానెల్ 'ఈఎస్పీఎన్' ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో టాప్ 100 ఆటగాళ్ల జాబితాను 'ఫేమ్ 100' పేరిట విడుదల చేసింది. వివిధ క్రీడల్లో ప్రతిభ, ఎండార్స్ మెంట్లు, సంపాదన, పాప్యులారిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆయా ఆటగాళ్లకు ఈ జాబితాలో స్థానం కల్పించింది. ఈ ఫేమ్ 100 జాబితాలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎనిమిదవ స్థానం సాధించుకున్నాడు. అగ్రస్థానంలో క్రిస్టియానో రోనాల్డో, లీబ్రాన్ జేమ్స్, లియొనెల్ మెస్సీ, నెయ్ మార్, రోజర్ ఫెదరర్, కెవిన్ దురంత్, టైగర్ వుడ్స్, విరాట్ కోహ్లీ, జేమ్స్ రోడ్రిగ్స్, రఫెల్ నాదల్ తరువాతి స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో ధోనీ 14వ స్థానంలో నిలవగా, సానియా మీర్జా 41వ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News