: ట్రంప్ పై విరుచుకుపడ్డ హిల్లరీ, మిషెల్లీ ఒబామా


అమెరికా అధ్యక్షబరిలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్, అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా విరుచుకుపడ్డారు. సాన్ బెర్నార్డినోలో హిల్లరీ మాట్లాడుతూ, ట్రంప్ అధ్యక్షుడైతే నియంతగా మారే ప్రమాదం ఉందని అన్నారు. అమెరికాకు కావాల్సింది అధ్యక్షుడు కానీ నియంతకాదని అన్నారు. అమెరికాకు వచ్చిన వలసవాదులను విమర్శించడం తప్ప, ట్రంప్ ప్రచారంలో కొత్త విషయం మరేదీ లేదని ఆమె తేల్చిచెప్పారు. ఇది రాజకీయ స్టంట్ అని ఆమె స్పష్టం చేశారు. న్యూయార్క్ సిటీ కాలేజ్ లో మిషెల్లీ ప్రసంగిస్తూ, ట్రంప్ నిత్యం వలసవాదులను విమర్శిస్తున్నారని, అది సరికాదని హితవు పలికారు. భయాలకు లొంగిపోయి గోడలు కడతామనడం సరికాదని ఆమె చెప్పారు. వివిధ దేశాల్లో జన్మించి, ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న చాలా మంది ప్రపంచంలో అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టడంలో భాగమయ్యారని ఆమె గుర్తుచేశారు. ప్రజలను ఆకట్టుకోవడంలో భాగంగా ట్రంప్ విద్వేషాలు రేపుతున్నారని ఆమె మండిపడ్డారు.

  • Loading...

More Telugu News