: భారత ఈ-కామర్స్ లోకి ప్రవేశిస్తున్న ‘లీ మాల్’


చైనీస్ ఇంటర్నెట్ అండ్ ఎకో సిస్టమ్ సమ్మేళనం లీఇకో భారత ఈ-కామర్స్ లోకి దూసుకువస్తోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 8న అధికారిక మెగా ఈవెంట్ ను సంస్థ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భారత ఈ-కామర్స్ లోకి తమ ప్లాట్ ఫామ్ లాంచ్ చేస్తున్నట్లు ‘లీఇకో’ ప్రతినిధులు వెల్లడించారు. లీఇకో కు చెందిన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, లెమె బ్లూటూత్ హెడ్ ఫోన్లు, స్పీకర్లు లాంటివి ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ సూపర్ ఫోన్లు రెండింటిని ‘టూ ఫ్యూచర్స్’ ఈవెంట్ టైటిల్ తో లీఇకో ప్రారంభించనుంది. గత నెల ఏప్రిల్ లోనే ఈ సూపర్ ఫోన్లను ‘లీఇకో’ చైనాలో ప్రవేశపెట్టింది. 2013లో మొదటిసారి చైనాలో ‘లీఇకో’ తన ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం అమెరికా, హాంకాంగ్ దేశాల ఈ-కామర్స్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News