: ఇంట్లో గడపడమే బెస్టు...అవన్నీ వదంతులే: శిల్పాశెట్టి భర్త


ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ను బీసీసీఐ నిషేధించిన అనంతరం దాని యజమానులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా కుటుంబంలో కలతలు వచ్చాయని బాలీవుడ్ లో కథనాలు వెలువడ్డాయి. వీటి కారణంగా వారిద్దరూ దూరంగా ఉంటున్నారని, ముంబైలోని జూహూలో ఉన్న తమ నివాసంలో ఇద్దరూ ఉండడం లేదని, విడివిడిగా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి. వీటిపై శిల్పా శెట్టి స్పందించలేదు కానీ, రాజ్ కుంద్రా మాత్రం స్పందించాడు. ఆఫీసుకు వెళ్లి తెల్లవారుజాము 1:30 నిమిషాలకు రావడం కంటే ఇంట్లోనే ఉండడం ఉత్తమంలా అనిపిస్తోందని అన్నాడు. ఈ ట్వీట్ తో తాను వ్యాపారవేత్తనని, తనకు పనులు ఉంటాయని, 24 గంటలు ఇంట్లో ఉండడం కుదరదని పరోక్షంగా చెప్పాడు. అలాగే తమ దాంపత్యంలో అంతా అనుకుంటున్నట్టు విభేదాలు లేవు అని కూడా స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News