: జూన్ 11న ఆడియో, జూలై 1న కబాలి విడుదల?
రజనీకాంత్ అభిమానులకు శుభవార్తను సినిమా యూనిట్ వినిపించింది. ఈ సినిమాను జూలై 1న విడుదల చేయనుండగా, ఈ నెల 11న ఆడియో వేడుకను నిర్వహించనున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. కొచ్చాడయాన్, లింగా వంటి పరాజయాల తరువాత వస్తున్న ఈ సినిమాపై రజనీ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గని రీతిలో సినిమాను నిర్మించినట్టు చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఈ నేపధ్యంలో రజనీ అందుబాటులో ఉండే జూన్ 11న చెన్నైలోని వైఎంసీఏ గ్రౌండ్ లో వేడుకగా అభిమానుల సమక్షంలో ఆడియో వేడుక నిర్వహించనున్నామని తెలిపారు. సంచలన వ్యూస్ తో టీజర్ దూసుకుపోతుండగా, ఆడియో విడుదలైతే మరిన్ని రికార్డులు కబాలి ఖాతాలో చేరడం ఖాయమని సినిమా యూనిట్ పేర్కొంటోంది. పా రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.