: ఐఎస్ ఉగ్రవాదులలో నైతికస్థైర్యం పెంచుతున్న వృద్ధ జీహాది


ఇరాక్ సైనిక దాడులకు వెన్ను చూపుతున్న ఐఎస్ ఉగ్రవాదుల్లో నైతిక స్థైర్యం నింపేందుకని ఒక వృద్ధ జీహాదీ రంగంలోకి దిగాడు. చైనాకు చెందిన ఈ జీహాది ఉగ్రవాదులతో కలిసి పోరాడేందుకని తన కుటుంబసభ్యుల సమేతంగా చైనా నుంచి ఇరాక్ కు తరలివచ్చాడు. 81 ఏళ్ల మహమ్మద్ అమిన్ చైనాలోని జింజియాంగ్ రాష్ట్రంలోని ఉయ్ గర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అక్కడి మైనార్టిటీ ముస్లిం గ్రూప్ నాయకుడిగా అమిన్ పనిచేశాడు. జీహాదిగా మారిన అతని కుమారుడు పోరాటంలో మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అమిన్ చూశాడు. దాంతో, ఇక తానే స్వయంగా ఇరాక్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకని ఫల్లూజా ప్రాంతానికి చేరుకున్నాడు. తీవ్రంగా ఎదురుదెబ్బలు తింటున్న ఐఎస్ ఉగ్రవాదులలో ఇప్పుడు తను నైతిక స్థైర్యాన్ని నింపుతున్నాడు. ఈ సందర్భంగా ఆ వృద్ధుడి ఫొటోను తాజాగా విడుదల చేశారు. కాగా, ఏడాది క్రితం అమిన్ మాట్లాడుతున్న ఒక వీడియోను ఐఎస్ విడుదల చేసింది. ఆ వీడియోలో ఏకే 47 తుపాకీ చేతబట్టిన అమిన్ ఇస్లాం రాజ్య స్థాపన గురించి మాట్లాడాడు.

  • Loading...

More Telugu News