: హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్ట్ ష్వార్జ్ నెగ్గర్ నిజ జీవితంలో భయపడ్డాడు!


'కానన్' సిరీస్, 'కమాండో', 'ప్రిడేటర్', 'టెర్మినేటర్' వంటి సినిమాల్లో అతి భయంకరమైన జంతువులను ఒంటిచేత్తో మట్టికరిపించిన హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ కు భయంకరమైన అనుభవం ఎదురైంది. తన స్నేహితులతో కలిసి సౌతాఫ్రికాలోని సఫారీ పార్కుకు ఆర్నాల్డ్ వెళ్లాడు. అక్కడ వారి జీపుకు ఓ పెద్ద ఆఫ్రికన్ జాతి ఏనుగు ఎదురొచ్చింది. జీపుకి దగ్గరగా వచ్చిన ఆ ఏనుగును చూసి అంతా కంగారుపడ్డారు. అది మరికాస్త దగ్గరగా వచ్చి జీపును తడిమింది. బోనెట్ పై వేడిని గుర్తించిన ఏనుగు, నాలుగు అడుగులు వెనక్కి వేయడంతో దాని ఉద్దేశ్యం గమనించిన ష్వార్జ్ నెగ్గర్ డ్రైవర్ ను అప్రమత్తం చేశాడు. దీంతో అతను జీపును స్టార్ట్ చేశాడు. ఒక్క సెకను ఆగిన ఏనుగు, ఆ ఇంజన్ సౌండుకి పక్కకు తప్పుకుంది. అయితే, అది వెనుక నుంచి వచ్చి వీరిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. ఆర్నాల్డ్ అప్రమత్తం చేయడంతో జీపును డ్రైవర్ ముందుకి దూకించాడు. ఏనుగు వెంటనే పరుగులంకించుకుంది. జీపును కాసేపు అలాగే వెంబడించింది. ఈ సమయంలో తమ పరిస్థితి చెప్పలేనని, విపరీతమైన భయం వేసిందని అన్నాడు. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని ఆర్నాల్డ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News