: ‘అ..ఆ’లో అల్లరి పిల్లని... నిజ జీవితంలోనూ అంతే!: హీరోయిన్ సమంత


‘అ..ఆ’ సినిమా గొప్ప కథేమీ కాదని, కాకపోతే, ఎమోషన్స్ ని దర్శకుడు త్రివిక్రమ్ చాలా చక్కగా చూపించారని దక్షిణాది అందాల భామ సమంత చెప్పింది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నిజజీవితంలో తాను అల్లరి పిల్లనేనని, ఈ చిత్రంలో తాను నటించిన పాత్ర కూడా అదేనని చెప్పింది. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది అని అనుకుంటారు, కానీ, అదేమీ కాదని చెప్పింది. ఏ సినిమా అయినా క్యారెక్టర్ నచ్చితేనే చేస్తానని, త్రివిక్రమ్ దర్శకుడు కదా అని చెప్పి ఈ చిత్రంలో తానేమీ నటించలేదని తన మనసులో మాట చెప్పింది. నితిన్ తనకు మంచి స్నేహితుడని చెప్పిన సమంతా, ఆ యువహీరోతో రొమాంటిక్ సన్నివేశాలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేదని, తనకు పెళ్లయిన తర్వాత కూడా చిత్రాల్లో నటిస్తానని సమంత స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News