: మా మావయ్యల పోలికలు ఉండడం తప్పా?: సాయిధరమ్ తేజ్
తనలో తన ముగ్గురు మావయ్యల పోలికలు ఉంటాయని యువనటుడు సాయిధరమ్ తేజ్ తెలిపాడు. తనలో వారి పోలికలు ఉన్నాయని పలు సందర్భాల్లో తన స్నేహితులు చెబుతుంటారని, అలాంటప్పుడు భలే గర్వంగా ఉంటుందని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. వాళ్ల చేతుల్లో పెరిగిన తాను, వారిని ప్రతిబింబిస్తున్నానంటే ఎవరికైనా గర్వంగా ఉంటుందని సాయి చెప్పాడు. అయినా వారిలా కనిపించడం నేరం కాదు కదా? అని ప్రశ్నించాడు. అవి జీన్స్ ప్రభావమని అన్నాడు. చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగిన తనలో వారి ప్రభావం స్పష్టంగా ఉంటుందని సాయి తెలిపాడు. తన తల్లిని విదేశాలకు తీసుకెళ్లాలని, ఆమెతో హాలీడేకు వెళ్లాలని... ఇలా చాలా కోరికలు ఉన్నాయని, అవన్నీ తీరిన తరువాత పెళ్లి చేసుకుంటానని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. తను చాలా మందికి ప్రపోజ్ చేశానని, అయితే అప్పట్లో లావుగా ఉండడం వల్ల తన ప్రపోజల్ ను ఎవరూ అంగీకరించలేదని సాయి నవ్వుతూ అన్నాడు. పెదమావయ్య చిరంజీవి 'రేయ్' సినిమా తప్ప తన సినిమాలన్నీ చూశారని, చినమావయ్య పవన్ కల్యాణ్ 'సుప్రీం' సినిమా చూశారని సాయి చెప్పాడు.