: నేను నటుడ్ని కాదు... నాకు టెన్షన్ లేదు: సచిన్


సహజంగా సినీ నటులు తమ సినిమాలు విడుదలవుతున్నాయంటే టెన్షన్ కు గురవుతారు. కానీ తన బయోపిక్ విడుదలకు దగ్గరపడుతున్నప్పటికీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం ఎలాంటి టెన్షన్ కి గురికావడం లేదు. సినిమా విషయంలో తనకు ఎలాంటి ఆందోళన లేదని సచిన్ తెలిపాడు. తానేమీ నటుడిని కాదని, తాను చేసిందే ఇందులో చూపించామని సచిన్ తెలిపాడు. కేవలం మ్యాచ్ లో బ్యాటింగ్ కు వెళ్లేటప్పుడు మాత్రమే ఆందోళనకు గురవుతుంటానని, ఈ ఆందోళన తనను బాగా ఆడేలా ప్రేరేపిస్తుందని అన్నాడు. అలా అలవాటు చేసుకున్నానని, బ్యాటింగ్ కు దిగేటప్పుడు తప్ప ఇంక దేనికీ ఆందోళన చెందనని సచిన్ వెల్లడించాడు. కాగా, హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ ఎర్ స్కిన్ సచిన్ బయోపిక్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News