: సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ల స్నేహం చెడిందా?
సుమారు రెండున్నర దశాబ్దాలుగా మంచి మిత్రులుగా కొనసాగుతున్న బాలీవుడ్ హీరోలు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ల మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ‘బాలీవుడ్ లైఫ్. కామ్’లో ఈ మేరకు ఒక కథనం వెలువడింది. శిక్షా కాలం ముగించుకుని ఎరవాడ జైలు నుంచి సంజయ్ దత్ ఆమధ్య విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన మేనేజర్ ను ‘హైర్’ కు తీసుకోమని సంజయ్ దత్ ను సల్మాన్ ఖాన్ కోరాడట. అయితే, తన కొత్త సినిమాల రెమ్యూనరేషన్ విషయమై సదరు మేనేజర్ సరిగా చెప్పడం లేదని, చాలా ఎక్కువ మొత్తంలో తీసుకుంటానని ప్రొడ్యూసర్ల వద్ద చెబుతున్నాడనే కారణాలతో ఆ మేనేజర్ ను మున్నాభాయ్ తొలగించాడట. దీంతో, మనస్తాపం చెందిన కండలవీరుడు కోపంగా ఉన్నాడని, దీనికితోడు మరికొన్ని సంఘటనలు కూడా వారి స్నేహం చెడటానికి ఆజ్యం పోశాయని ఆ కథనంలో పేర్కొంది.