: ప్రియుడి కోసం పారిస్ వెళ్లిన దీపికా పదుకునే


బాలీవుడ్ యువజంట దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్ లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ప్రతిఫంక్షన్లోనూ వీరిద్దరూ కలసి వచ్చి తెగ హడావుడి చేసేవారు. అయితే, ఇటీవలే దీపిక హాలీవుడ్ లో కాలు మోపడంతో, ప్రియుడ్ని కలిసేందుకు అమ్మడికి ఎక్కువగా కుదరడం లేదు. అయినా అప్పుడప్పుడు కలుస్తూనే వున్నారు. ఆ మధ్య శ్రీలంకలో జరిగిన దీపిక స్నేహితురాలి పెళ్లిలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. తరువాత షూటింగ్ లలో బిజీగా ఉండడంతో వీలు చిక్కలేదు. తాజాగా తన హాలీవుడ్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో దీపిక ఆగమేఘాలపై వెళ్లి, పారిస్ లో 'బేఫికర్' షూటింగ్ లో ఉన్న ప్రియుడు రణ్ వీర్ సింగ్ దగ్గర వాలిపోయింది. ఆమెను చూసి ఆ సినిమా యూనిట్ షాక్ అయిందట. ఇక అక్కడున్న అభిమానులు దీపికను గుర్తుపట్టేశారు. ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా వారిని షూటింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఇది వ్యక్తగత విషయమని, ఫోటోలు తీయవద్దని సూచించారు. ప్రియుడ్ని కలిసేందుకు దీపిక రావడం సాధారణ విషయమేనని యూనిట్ తెలిపింది.

  • Loading...

More Telugu News