: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్


బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్-9 తుది పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. తుదిపోరులో తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు వేటికవే విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నాయి. స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుందనే కారణంతోనే సన్ రైజర్స్ కెప్టెన్ బ్యాటింగ్ ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇరు జట్లలో ఎటువంటి మార్పులు లేవు. మ్యాచ్ కు వర్షం ముప్పు తప్పడంతో క్రికెట్ అభిమానులు సంతోషంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News