: టీడీపీ నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ఇంజనీర్ల జేఏసీ డిమాండ్
మహానాడును పురస్కరించుకుని తమపై తెలుగు దేశం నేతలు చేసిన వ్యాఖ్యలపై ఇంజనీర్ల జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాదులో తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ నేతలు మాట్లాడుతూ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో ఇంజినీర్లు కమీషన్ తీసుకుంటున్నారని అంటున్న టీడీపీ నేతలు తమ ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు తమపై అవాకులు చవాకులు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల తమ ఆత్మస్థైర్యం దెబ్బతిందని వారు చెప్పారు. టీడీపీ నేతలు తక్షణం తమకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.