: ఉగ్రవాదంపై టర్కీ ఉక్కుపాదం.. 104 మంది ఇస్లామిక్ స్టేట్ సభ్యుల హతం
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఉగ్రవాదుల పట్ల టర్కీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తమ దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యంగా ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహిస్తోంది. తాజాగా నిన్న రాత్రి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు టర్కీ అధికారులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా వైమానిక దాడులు జరుపుతున్నట్లు టర్కీ పేర్కొంది. మిలటరీ హతమార్చిన ఉగ్రవాదుల సంఖ్య 104 వరకు ఉండచ్చని, అయితే వారి సంఖ్యపై కచ్చితమైన వివరాలు ఇప్పుడే చెప్పలేమని టర్కీ ప్రభుత్వం తెలిపింది. వైమానిక దాడులతో పాటు ఇతర మార్గాల్లోనూ ఉగ్రవాదులను అంతమొందిస్తున్నట్లు చెప్పింది.