: కీలకమైన దశలో 'అ..ఆ' సినిమా చేశాను... దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాను: నితిన్
'అ...ఆ' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నానని సినీ నటుడు నితిన్ తెలిపాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు చాలా కాలంగా ఎదురు చూశానని అన్నాడు. 'అ...ఆ' సినిమాలో త్రివిక్రమ్ తన లుక్ పూర్తిగా మార్చేశాడని చెప్పాడు. వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను త్రివిక్రమ్ నుంచి చాలా నేర్చుకున్నానని నితిన్ వెల్లడించాడు. తన గత సినిమాలను చూసిన త్రివిక్రమ్ తనలో బలాలు, బలహీనతలను కనిపెట్టాడని తెలిపాడు. తన నటనలోని బలహీనతలు తీసేసి నటింపజేసిన సినిమా ఇదని, దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నానని అన్నాడు. ఈ ప్రయత్నం సత్ఫలితాన్నిస్తుందని నితిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తన కెరీర్ లో కీలకమైన దశలో ఈ సినిమా చేస్తున్నానని, దీనికి వచ్చే ఫలితాన్ని అనుసరించి ఇకపై కథలను ఎంచుకుంటానని నితిన్ తెలిపాడు.