: మహానాడు వ్యాఖ్యాతగా పయ్యావుల!... తిరుపతికి తరలివచ్చిన టీ టీడీపీ నేతలు
టీడీపీ వార్షిక వేడుక మహానాడు’ తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో నేటి ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి ప్రారంభోపన్యాసంతో ప్రారంభమైన ఈ వేడుకలకు వ్యాఖ్యాతగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వ్యవహరిస్తున్నారు. వాగ్ధాటిలో మేటి నేతగా ఎదిగిన పయ్యావుల వ్యాఖ్యానం పార్టీ నేతలను ఆకట్టుకుంటోంది. ఇక నవ్యాంధ్రప్రదేశ్ లో తొలిసారిగా జరుగుతున్న ఈ వేడుకలకు తెలంగాణ టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు హాజరయ్యారు. టీ టీడీపీ చీఫ్ ఎల్.రమణ, టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, నన్నూరి నర్సిరెడ్డి తదితర నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.