: 'రాహుల్ గాంధీ మా పనిమనిషి' అనగానే సంతకం పెట్టి స్టాంపేసిన పోలీసులు!

ఉత్తర ప్రదేశ్ లో పోలీసులు ముందూ వెనుకా చూడకుండా రాహుల్ గాంధీని ఓ ఇంట్లో పనిమనిషిగా చేసేశారు. ఘజియాబాద్ సమీపంలోని ఇందిరాపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ పరిశీలనలో బయటపడ్డ ఈ ఉదంతం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఓ వ్యక్తి తన ఇంట్లో హెల్పర్ గా రాహుల్ గాంధీ ఉంటున్నాడని చెబుతూ, ఆయన ఫోటోను అతికించి పోలీసులకు వెరిఫికేషన్ ఫారమ్ ఇస్తే, దాన్ని ఓకే చేసిన పోలీసులు స్టాంపేసి సంతకం పెట్టారు. రాహుల్ చిరునామాను హౌస్ నంబర్ 12, తుగ్లక్ లేన్, న్యూఢిల్లీ అని, వృత్తి వద్ద రాజకీయాలని, మెరిటల్ స్టేటస్ వద్ద పెళ్లి కాలేదని రాశాడు. ఇక పోలీసులు వెరిఫికేషన్ చేయకుండానే దీన్ని ఓకే చేయడంపై అధికారులు స్పందిస్తూ, ఇది చాలా పాత ఫారమ్ అని, ఎవరో ఆకతాయి చేసి వుండవచ్చని, విచారిస్తున్నామని తెలిపారు.

More Telugu News