: ఎంసెట్ పాస్, ఇంటర్ ఫెయిల్... 18,143 మందికి బ్యాడ్ లక్!
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, వారికి ర్యాంకు రాని పరిస్థితి. ఎంసెట్ లో పాసైనప్పటికీ, వేల మంది విద్యార్థులు ఇంటర్ లో ఫెయిల్ కావడంతో వారికి ర్యాంకులను ప్రకటించలేదు. మొత్తం 18,143 మంది విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించలేదు, మరో 3,114 మంది విద్యార్థులు తమ ఇంటర్ మార్కుల జాబితాను ఇవ్వకపోవడంతో వారికి కూడా తెలంగాణ విద్యా శాఖ ర్యాంకులను ఇవ్వలేదు. కాగా, తెలంగాణ ఎంసెట్ కు 2,23,542 మంది హాజరు కాగా, 2,00,861 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. వివిధ కారణాల వల్ల ఎంసెట్ కమిటీ 1,79,609 మందికి మాత్రమే ర్యాంకులను ప్రకటించింది.