: తప్పులో కాలేసిన రాంగోపాల్ వర్మ!... ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేసిన ఫొటో అంగూర్లతాది కాదట!
అసోంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆ రాష్ట్ర సినీ నటి అంగూర్లతా దేకాకు సంబంధించిన ట్వీట్ లో బాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తప్పులో కాలేశారు. ఈ మేరకు అంగూర్లతా దేకాగా ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్న ఫొటోలు ఆమెవి కాదని, ఆ ఫొటోలో ఉన్నది తానంటూ ఫిట్ నెస్ లేడీ సప్నా వ్యాస్ పటేల్ పేర్కొంది. ఈ మేరకు ఆ ఫొటోలు తనవంటూ ఆమె ‘ఇన్ స్టాగ్రాం’ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ హీరోయిన్ ఇంత అందంగా ఉండటంతో రాజకీయాలపై తనకు తొలిసారి ఆసక్తి కలిగిందంటూ వర్మ మొన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వర్మ ట్వీట్లపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించిన వైనమూ విదితమే.