: అసోంకు పూర్తి భిన్నంగా రేపు మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 41 మంది మంత్రులతో మమతా బెనర్జీ కొలువుదీరనుండగా, కేబినెట్ లో 14 మంది కొత్త వారికి ఆమె కేబినెట్ లో స్ధానం కల్పిస్తున్నారు. మంత్రివర్గ సహచరుల లిస్టును ఆమె గవర్నర్ త్రిపాఠికి అందించారు. కాగా, అసోంలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీకి భిన్నంగా బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. శర్బానంద సోనోవాల్ ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రులు, 14 మంది ముఖ్యమంత్రులు హాజరైన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు ప్రత్యేక విమానంలో ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. బీజేపీ అంత ఆడంబరంగా నిర్వహించగా, దీదీ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం నిర్వహించడం విశేషం.

  • Loading...

More Telugu News