: ఒక నటిగా రోజూ నేను భయపడతాను: హీరోయిన్ రాధికా ఆప్టే


ఒక నటిగా రోజూ తాను భయపడతానని కోలీవుడ్ అందాల తార రాధికా ఆప్టే చెప్పింది. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, భయం అనిపిస్తున్నా నటుల ముఖంలో ఆ తాలూకు లక్షణాలు కనిపించకుండా గడపాల్సి ఉంటుందని, ఒక నటిగా తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపింది. అయితే, ఇటువంటి సమస్యలు లెక్కచేయకుండా ముందుకు వెళ్లిపోవాలని, నటులుగా సెలబ్రిటీ హోదాను కంటిన్యూ చేయడం చాలాకష్టమని చెప్పుకొచ్చింది. కాగా, పవన్ కిర్పలాని దర్శకత్వంలో రాధికా ఆప్టే నటించిన ‘ఫోబియా’ చిత్రం రేపు విడుదల కానుంది.

  • Loading...

More Telugu News