: సన్‌రైజర్స్ బౌలర్ నెహ్రాపై ట్విట్టర్‌లో సెహ్వాగ్ ప్రశంసల జల్లు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతోన్న బౌలర్ ఆశిష్ నెహ్రాను ట్విట్టర్ వేదికగా టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అభినందించాడు. గాయాలపాలై ప్రస్తుతం చికిత్స పొందుతోన్న నెహ్రా త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. నెహ్రా క్రికెట్‌లో మళ్లీ నిలదొక్కుకోవడం అద్భుతమైన విషయంగా సెహ్వాగ్ అభివర్ణించాడు. అంతేకాదు, నెహ్రాను సెహ్వాగ్ సూపర్ హీరోగా పేర్కొన్నాడు. గొప్ప ఆటగాడు నెహ్రాను ఉద్దేశించి ట్వీట్ చేస్తున్నానని, ఈ ట్వీట్ పై అధిక సంఖ్యలో రీ ట్వీట్‌లు రావాలని కూడా ఆయన కోరాడు.