: బీజేపీ రెండేళ్ల పాలన హడావుడిపై కేజ్రీ ఆగ్రహం
రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ చేస్తోన్న ప్రచారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ పబ్లిసిటీకి ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చుచేస్తోందని కేజ్రీవాల్ మరోసారి ఆరోపించారు. రెండేళ్ల పాలన సందర్భంగా తమ ప్రచారం కోసం కేంద్రం రూ.1,000 కోట్లకు పైగా వినియోగించిందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ఖర్చుని కేజ్రీవాల్ తమ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో పోల్చుతూ... తాము సంవత్సర వ్యవధిలో అన్ని శాఖలకు సంబంధించి కేవలం రూ.150కోట్లు మాత్రమే ప్రచారానికి వినియోగించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.