: 40 రోజులు.. 24 ప్రకటనలు.. రూ.100 కోట్ల ఆదాయం.. ప్రియాంక చోప్రా రికార్డు


హాలీవుడ్ లోకి ప్రవేశించి బిజీ బిజీగా మారిపోయిన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఈరోజు ముంబయికి రానుంది. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’, హాలీవుడ్ మూవీ ‘బేవాచ్’ షూటింగ్ లతో తీరిక లేకుండా గడిపిన ఈ అమ్మడికి కాస్త గ్యాప్ దొరికిందట. ఈ గ్యాప్ లోనూ ఏ మాత్రం సమయం వృథా చేసుకోకుండా ముంబ‌యిలో ప్ర‌ముఖ కంపెనీల కోసం 24 ప్రకటనల షూటింగుల్లో పాల్గొనబోతోంది. 40రోజులు ఈ ప్ర‌క‌ట‌నల షూటింగ్‌లో న‌టించ‌నుంది. కేవ‌లం 40రోజుల్లో ప్ర‌క‌ట‌న‌ల ద్వారా రూ.100 కోట్లు సంపాదించ‌నుంది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా దీంతో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ కానుంది. ముంబయిలో 40రోజులు గ‌డ‌ప‌నున్న ప్రియాంక చోప్రా నుంచి త‌న బాలీవుడ్ రీ ఎంట్రీ విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త కూడా వ‌చ్చేస్తుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల అంచ‌నా.

  • Loading...

More Telugu News