: తాలిబన్లకు కొత్త చీఫ్... హైబతుల్లా!
తాలిబన్ ఉగ్రవాద సంస్థకు కొత్త చీఫ్ గా ముల్లా హైబతుల్లా అకుంజ్ నియమితుడయ్యాడు. పాకిస్థాన్ సరిహద్దుల్లో నమ్మన బంటుతో వెళ్తున్న ముల్లా అఖ్తర్ మన్సూర్ పై అమెరికా డ్రోన్ బాంబులు కురిపించి అతనిని అంతమొందించింది. ఈ మేరకు పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనను తాలిబాన్ సంస్థ కూడా ధ్రువీకరించింది. దీంతో 'షురా (సూప్రీం కౌన్సిల్) లో ఇస్లామిక్ ఎమిరేట్ (తాలిబన్) లీడర్ గా హైబతుల్లా నియామకం ఏకగ్రీవంగా జరిగిందని తాలిబాన్ ప్రకటించింది. ఈ సందర్భంగా సభ్యులంతా ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రతినబూనారని ఈ సంస్థ వెల్లడించింది. ఈ సమావేశం పాకిస్థాన్ లోనే జరగడం విశేషం. అమెరికా దళాలను తమ బద్ధశత్రువుగా అభివర్ణించిన తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యూకూబ్, సిరాజుద్దీన్ హక్కానీలను తాజా చీఫ్ డిప్యూటీలుగా నియమించారు. అకుంజ్ ను చీఫ్ గా నియమించేందుకు ముందు వారిద్దరూ ఆ పదవికి పోటీ పడ్డారు. వారిద్దరినీ చీఫ్ కు డిప్యూటీలుగా నియమించడంతో వర్గపోరును అరికట్టవచ్చని తాలిబన్ భావిస్తోంది.