: సన్యాసినిగా మారిన రోహిత్ శర్మ గర్ల్ ఫ్రెండ్ సోఫియా హయత్
మీకు సోఫియా హయత్ గుర్తుందా? క్రికెటర్ రోహిత్ శర్మకు ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్. 2012లో రోహిత్ శర్మ 264 పరుగులు కొట్టిన వేళ, నగ్నంగా ఫోటో దిగి, దాన్ని కానుకగా ఇచ్చిన హాట్ బ్యూటీ. ఆపై 2013లో బిగ్ బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పోటీ పడింది కూడా. బ్రిటీష్ జాతీయురాలిగా ఓ ప్రముఖ మోడల్ గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు జీవితంపై విరక్తి చెందిందో ఏమో గానీ సన్యాసినిగా మారిపోయింది. తన పేరును గియా సోఫియా మదర్ గా మార్చుకున్న ఆమె, సన్యాసి రూపంలోని తన చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.