: ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించే చిత్రం ఇదేనేమో!: ఏఆర్ రెహ్మాన్


ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించనున్న చిత్రం ‘సచిన్’ కావచ్చని సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ అన్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సచిన్’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, సచిన్ జీవితం గురించి గతంలో ఎన్నడూ వినని, చూడని అంశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. ఈ చిత్రానికి వినసొంపైన సంగీతాన్ని తాను అందించానని, అందుకే ఈ చిత్రం విడుదల కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని, ప్రస్తుతం ఈ చిత్రం తుదిమెరుగులు దిద్దుకుంటోందని చెప్పారు. కాగా, జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవి భాగ్ చంద్కా సమర్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News