: సల్మాన్ గురించి అడిగిన వేళ... చిర్రెత్తుకొచ్చి వెళ్లిపోయిన ఐష్!
"భవిష్యత్తులో మీరు సల్మాన్ ఖాన్ తో సినిమాను చేస్తారా?" అన్న ప్రశ్న వేసినందుకు, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ కి ఒళ్లు మండిపోయి, ఇంటర్వ్యూ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేయాలని కేకలు పెడుతూ విసవిసా బయటకు వెళ్లిపోయిందట. సరబ్ జీత్ చిత్రం ప్రమోషన్ కోసం నిర్మాత వసూ భగ్నానీ ఆఫీసులో ఐశ్వర్య ఇస్తున్న ఇంటర్వ్యూలో ఈ ఘటన జరిగింది. ఇంటర్వ్యూకు జాకీగా వ్యవహరిస్తున్న వ్యక్తి వచ్చి సర్ది చెప్పబోయేందుకు చూసినా ఐష్ కోపం తగ్గకపోగా, తిరిగి ఇంటర్వ్యూకు రాలేదట. అంతవరకూ సరదా సరదాగా మాట్లాడుతూ, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చిన ఆమె, సల్మాన్ పేరెత్తగానే ఇలా చిర్రెత్తుకొచ్చి వెళ్లిపోవడం చూసి జర్నలిస్టులు అవాక్కయ్యారు.