: ఐపీఎల్-9లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ నేడే.. ఫైనల్ చేరే జట్టు గుజరాతా..? బెంగళూరా..?
తుది అంకానికి చేరుకున్న ఐపీఎల్ పోరులో నేడు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. నేడు రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ లో గుజరాత్ లయన్స్ తో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఐపీఎల్ సిరీస్ లన్నింటిలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేకపోయిన బెంగళూరు జట్టు ఈ సారి ఎలాగైనా గెలవాలనే ఆత్రుతతో ఉంది. అంచనాలకు మించే రాణిస్తోంది. మరే జట్టులో లేని ముగ్గురు దిగ్గజ బ్యాట్స్‌మెన్ కోహ్లీ, క్రిస్‌గేల్, కోహ్లీ, డివిలియర్స్ ఉన్నారు. అటు గుజరాత్ జట్టు ప్రస్తుత సీజన్ లో ఆరోన్ పించ్, మెక్‌కల్లమ్, స్మిత్, రైనా వంటి బ్యాట్స్ మన్స్‌తో బలంగా కనపిస్తోంది. దీంతో నేటి మ్యాచ్ పరుగుల వరద ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ కన్నా బెంగళూరు జట్టే బలంగా కనిపిస్తోన్నా.. గుజరాత్ లయన్స్ తమ ప్రత్యర్థి టీమ్ ను మట్టికరిపించే అవకాశాలూ లేకపోలేదు. గుజరాత్ టాప్ ఆర్డర్ క్రీజులో నిలదొక్కుకుంటే వారిని కట్టడి చేయడం బెంగళూరు బౌలర్లకు అసాధ్యమే.