: నాగ చైతన్య పోస్టర్ తో నాగార్జునకు అభినందనలు చెప్పిన కోన వెంకట్


అక్కినేని నాగార్జున చిత్ర రంగంలోకి ప్రవేశించి ఈరోజుతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రచయిత, నిర్మాత కోన వెంకట్ వెరైటీగా తన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. నాగార్జున తనయుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా పోస్టర్ ను కోన వెంకట్ పోస్టు చేశారు. తెలుగు చిత్ర రంగంలో ఉన్న తన లాంటి వారెందరికో నాగార్జున స్ఫూర్తిదాయకమని, నాగ్ నటనాప్రయాణం నిరంతరం కొనసాగుతుండాలంటూ ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News