: లక్ష్యం 159...సూపర్ స్టార్లు లేరు...అయినా గెలుస్తాం: బ్రాత్ వైట్


రాయ్ పూర్ వేదికగా ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ (73) మరోసారి రాణించి జట్టుకు భారీ స్కోరు అందించాడు. టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాదును ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాదు జట్టులోని ధావన్ (10), హూడా (1), యువరాజ్ సింగ్ (10), హెన్రిక్స్ (18), మోర్గాన్ (14)ల వికెట్లు పడుతున్నా వార్నర్ మాత్రం బెదురన్నదే లేకుండా ఆడాడు. చివర్లో అవుటైనప్పటికీ నమన్ ఓజా (16), భువనేశ్వర్ కుమార్ (13) ఫర్వాలేదనిపించడంతో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లలో బ్రాత్ వైట్ రెండు వికెట్లు తీయగా, మిశ్రా, డుమిని చెరో వికెట్ తీశారు. 159 పరుగుల విజయలక్ష్యంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ ప్రారంభించనుంది. అయితే తమ జట్టులో వార్నర్, కోహ్లీ, డివిలియర్స్ వంటి సూపర్ స్టార్లు లేరని, అయినప్పటికీ తాము కలసికట్టుగా ఆడుతామని, విజయం సాధిస్తామని బ్రాత్ వైట్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News