: తండ్రి మాట ప్రకారం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సైఫ్ అలీఖాన్ కుమార్తె
తండ్రి ఆదేశం ప్రకారం సరా అలీఖాన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సరా అలీ ఖాన్ (22) అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఆమె తీసుకున్న ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పెట్టిన డిజైనర్ సందీప్ ఖోస్లా...తండ్రి ఆదేశానుసారం తన స్నేహితుడి కుమార్తె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందని పేర్కొన్నాడు. సరా అలీఖాన్ ను బాలీవుడ్ కు పరిచయం చేసేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే ఆమె విద్య పూర్తి కాకుండా హీరోయిన్ అయ్యేందుకు సైఫ్ అలీఖాన్ అంగీకరించలేదు. దీంతో ఆమె విద్యకు ప్రాధాన్యతనిచ్చింది. మరి ఇప్పుడు ఆమెకు కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కాగా, సరా అలీ ఖాన్, సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కుమార్తె. 1991లో వివాహం చేసుకున్న ఈ దంపతులు 13 ఏళ్ల దాంపత్యం తరువాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సైఫ్, కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.