: కాజల్ అందంగా ఉంటుంది...సమంత అంతకంటే అందగత్తె!: మహేష్ బాబు
'బ్రహ్మోత్సవం' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో మహేష్, కాజల్ లను సమంత సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా ర్యాపిడ్ రౌండ్ ప్రశ్నలు అంటూ మహేష్ కు సింగిల్ వర్డ్ ప్రశ్నలు వేసి, అతని నుంచి చక్కని సమాధానాలు రాబట్టింది. ఆ ప్రశ్నలు, జవాబులు... సమంత: శ్రీకాంత్ అడ్డాల? మహేష్ : మంచి భావుకుడు, మంచి మనిషి. సమంత: కాజల్? మహేష్ : (కాసేపు ఆలోచించి) బ్యూటిఫుల్ సమంత : సమంత? మహేష్ : (చిలిపిగా చూస్తూ) ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ (సమంత ముఖంలో మెరుపు) సమంత : సత్యరాజ్ తో అనుభవం? మహేష్ : నేను పని చేసిన వారిలో 'ఉత్తమ నటుడు' సమంత: జయసుధ? మహేష్ : స్పాంటేనియస్ యాక్ట్రెస్ సమంత : రావు రమేష్? మహేష్ : టెరిఫిక్ యాక్టర్