: ఇస్లాం మతంపై అవగాహన ఏర్పడుతుంది, రిటైరయ్యాక వచ్చి మా 'లా' కంపెనీలో పనిచేయండి!: ఒబామాకి జాబ్ ఆఫర్ ఇచ్చిన లాయర్
అమెరికా అధ్యక్ష పదవిని దక్కించుకోవడమే లక్ష్యంగా ఓ వైపు ట్రంప్, హిల్లరీ ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. మరోవైపు ఒబామా వచ్చే ఏడాది ఆరంభం నాటికి అమెరికా అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పనున్నారు. అయితే, ఒబామా అధ్యక్ష పదవీ విరమణ చేశాక, తన 'లా' కంపెనీలో ఆయనకు ఉద్యోగం ఇస్తానని ఎమిరేటీ లాయర్ ఎయిసా బిన్ హైదర్ ఆఫర్ చేశారు. ఇస్లాం అంటే ఉగ్రవాదమే అనేలా అమెరికా ప్రవర్తిస్తోందని, నిజమైన ఇస్లాం అంటే ఎలా ఉంటుందో తన లా కంపెనీలో ఉద్యోగం చేస్తే ఒబామాకి తెలిసొస్తుందని ఆయన ట్వీట్ చేశారు. తన దగ్గర పనిచేస్తే ఒబామాకు మంచి ఉద్యోగ భద్రత ఉంటుందని బిన్ హైదర్ తెలిపారు. ఉద్యోగంతో పాటు మంచి ఆఫర్లను కూడా ఒబామాకి ప్రకటించారు. మంచి వేతనం, ఉండడానికి ఇల్లు, అరబ్ దేశాల పర్యటనకి టికెట్లు వంటి సౌకర్యాలు కల్పిస్తానని ఆయన పేర్కొన్నారు.