: భర్త నుంచి విడాకులు తీసుకున్న మోడల్ ను వివాహమాడుతున్న సల్మాన్!


దేశంలోని బ్యాచిలర్లంతా గురువుగా భావించే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఏడాది చివరికి ఓ ఇంటివాడు కానున్నాడంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటన్నింటిని నిజం చేస్తూ ప్రీతి జింటా వివాహ రిసెప్షన్ సందర్భంగా సల్మాన్ తన ప్రియురాలు లులియా వంతూర్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. దీంతో వీరి వివాహం ఖాయం అన్న ఫీలింగ్ కి బాలీవుడ్ వచ్చేసింది. ఇప్పటికైనా తమ మిత్రుడు వివాహం చేసుకుంటున్నందుకు ఆయన సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సల్మాన్ జీవితంలో ఇదే తొలి వివాహం. మరి సల్మాన్ కాబోయే భార్యగా చెబుతున్న లులియా వంతూర్ విషయం ఏంటంటే, ఆమెకి ఇది రెండో వివాహం. రోమేనియాకి చెందిన లులియా వంతూర్ మోడల్ గా పని చేసేది. ఆ సమయంలోనే రొమేనియన్ సూపర్ స్టార్ మారిసయ్ మెగాను వివాహం చేసుకుంది. నాలుగేళ్ల వీరి దాంపత్యం విఫలమైంది. దీంతో విడాకులు తీసుకున్నారు. దీంతో సల్మాన్ తో ఆమె వివాహం కానుందని తెలుస్తోంది. అయితే సల్మాన్ తో ఆమె పరిచయం, ప్రేమపై క్లారిటీ రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News