: దుబాయ్ లో భారత యువతిపై పాక్ మేనేజర్ దాష్టీకం... 26న తీవ్ర శిక్ష విధించనున్న యూఏఈ కోర్టు!


ఉద్యోగం వస్తుందని నమ్మి వెళ్లిన ఓ భారత యువతి (19)ని లైంగికంగా వేధించిన ఓ పాక్ మేనేజర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తీవ్ర శిక్షను ఎదుర్కోనున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, దుబాయ్ లోని రషీదియా ప్రాంతంలో ఓ నిర్మాణ రంగ సంస్థలో పాక్ కు చెందిన మేనేజర్ పనిచేస్తున్నాడు. దుబాయ్ లోనే గృహిణిగా ఉంటూ, తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఓ జాబ్ కోసం బాధితురాలు నిరీక్షిస్తూ ఉంది. ఆమె ప్రొఫైల్ చూసిన పాక్ మేనేజర్, తమ కంపెనీలో సెక్రటరీ ఉద్యోగం ఉందని నమ్మబలికి పిలిచాడు. ఆమె నమ్మి అతనిచ్చిన చిరునామాకు వెళితే, అక్కడ కంపెనీ కార్యాలయం బదులు, సదరు మేనేజర్ ఇల్లు ఉంది. ఆపై మాయమాటలు చెబుతూ, తన ఇంట్లోకి, ఆపై బెడ్ రూములోకి తీసుకు వెళ్లిన కామాంధుడు, ఆమెను లైంగికంగా వేధించాడు. బయటకు వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదై నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో తీర్పు 26న వెల్లడి కానుండగా, నిందితుడికి తీవ్ర శిక్ష పడనుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News