: వెట్టెల్ కు షాక్... స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచిన 18 ఏళ్ల మాక్స్ వెర్స్ టాపెన్


ప్రపంచ ఫార్ములా వన్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇంకా టీనేజ్ వయసును కూడా దాటని మాక్స్ వెర్స్ టాపెన్ (18) దిగ్గజాలను ఓడించి స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్నాడు. డచ్ కి చెందిన మాక్స్, సెబాస్టియన్ వెట్టెల్ ను సైతం ఈ రేసులో వెనక్కు నెట్టాడు. తానాడుతున్న 24వ ఎఫ్1 రేసులోనే, నాలుగు సార్లు చాంపియన్ గా నిలిచిన వెట్టెల్ ను ఓడించడంతో పాటు అతి తక్కువ వయసులోనే రెడ్ బుల్ డ్రైవర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. భవిష్యత్ ఫార్ములా వరల్డ్ చాంపియన్ కావడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. తొలి ల్యాప్ లో చాంపియన్ షిప్ లీడర్ నికో రోస్ బెర్గ్ కారుతో స్వల్పంగా ఢీకొన్నప్పటికీ, ఆపై వెనుదిరిగి చూడని మాక్స్, ఆపై వెట్టెల్ తో పాటు కిమి రైకోనెన్, విలియన్స్, కార్లోస్ సైన్జ్, సెర్గియో పెరెజ్, ఫెలిపీ మెసా, జెన్సన్ బుట్టన్ తదితరులను చేజ్ చేస్తూ, వాళ్లను వెనక్కు నెడుతూ దూసుకెళ్లాడు.

  • Loading...

More Telugu News