: శింబు వివాదానికి ముగింపు పలకాలి...ఇంకా సాగదీయొద్దు: విశాల్


సినీ నటుడు శింబు బీప్ సాంగ్ వివాదానికి ఇకనైనా ముగింపు పలకాలని విశాల్ సూచించాడు. ఒక ప్రతిభావంతుడైన నటుడి వల్ల వివాదం రేగితే, అతనితో క్షమాపణలు అడిగితే సరిపోతుందని అన్నాడు. ఓ చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం పెద్ద శిక్ష అని, దీనిని శింబు న్యాయపరంగా ఎదుర్కొంటున్నాడని, అది చాలని, ఇంకా ఈ వివాదాన్ని సాగదీయవద్దని విశాల్ సూచించాడు. నడిగరసంఘం ఎన్నికల్లో మద్దతు విషయంలో శింబు నిర్ణయం అతని పర్సనల్ అని చెప్పాడు. శింబు తమ సినీ కుటుంబానికి చెందినవాడని చెప్పాడు. తాను నటించిన 'రాయుడు' సినిమా అందర్నీ అలరిస్తుందని విశాల్ తెలిపాడు. ఇందులో శ్రీదివ్య సంప్రదాయమైన పాత్ర పోషించిందని చెప్పాడు. సినిమాలో డైలాగులు, కథ అందరినీ ఆకట్టుకుంటాయని విశాల్ తెలిపాడు.

  • Loading...

More Telugu News