: ఆర్బీఐ రిక్రూట్ మెంట్ 2016: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా ఖాళీల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

వివిధ విభాగాల్లో మేనేజర్ల పోస్టులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేస్తూ, దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రేడ్ బీలో మేనేజర్ (టెక్నికల్ - సివిల్), మేనేజర్ (టెక్నికల్ - ఎలక్ట్రికల్), గ్రేడ్ ఏలో అసిస్టెంట్ మేనేజర్ (రాజ్యసభ), అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ), అసిస్టెంట్ లైబ్రేరియన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది. వీటిల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ రిజర్వేషన్లు వర్తించవని, అయితే, వారికి దరఖాస్తు ఫీజులో రాయితీలు వర్తిస్తాయని వెల్లడించింది. రాజ్యసభలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టును దైవాంగులకు (పీడబ్ల్యూడీ) కేటాయించినట్టు పేర్కొంది. అభ్యర్థులు www.rbi.org.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేసింది.

More Telugu News